Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
Bihar Man Kills Wife | ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యను హత్య చేశాడు. చోరీ చేసిన బైక్‌పై మృతదేహాన్ని తరలించి ఒక కాలువలో పడేశాడు. మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ఆమె భర్తను అరెస్ట్ చేశారు.
బెంగళూరు: ఒక వ్యక్తి అనుమానంతో తన భార్యను హత్య చేశాడు. చోరీ చేసిన బైక్‌పై మృతదేహాన్ని తరలించి ఒక కాలువలో పడేశాడు. మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ఆమె భర్తను అరెస్ట్ చేశారు. (Bihar Man Kills Wife) బీహార్‌కు చెందిన 25 ఏళ్ల రుక్సానా మొదటి భర్త నుంచి విడిపోయింది. ఒక బిడ్డ ఉన్న ఆమె బెలూన్లు అమ్మే సమయంలో అదే రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇర్ఫాజ్ పరిచయమయ్యాడు. ప్రేమించుకున్న వీరిద్దరూ ఏడాది కిందట పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల కిందట కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకున్నారు. ఇర్ఫాజ్ ఒక క్లాత్ ఫ్యాక్టరీలో పని చేస్తుండగా రుక్సానా కూడా ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది.
కాగా, రుక్సానా తరచుగా ఫోన్లో ఎవరితోనో మాట్లాడటంతో మరో వ్యక్తితో ఆమెకు సంబంధం ఉన్నట్లు
ఇర్ఫాజ్ అనుమానించాడు. దీంతో ఈ జంట మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అక్టోబర్ 10న ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో రుక్సానాను రాయితో కొట్టి ఇర్ఫాజ్ హత్య చేశాడు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కాడు. భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టాడు. చోరీ చేసిన బైక్‌పై ఆమె మృతదేహాన్ని తరలించాడు. గోపాలపుర ప్రాంతంలోని మురుగు కాలువలో బైక్‌తో సహా మృతదేహాన్ని పడేశాడు.
మరోవైపు అక్టోబర్ 13న ఆ మురుగు కాలువలో మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ హత్యపై దర్యాప్తు కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆమె ఎవరన్నది గుర్తించేందుకు గోపాలపుర ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఆరా తీశారు. చివరకు ఇర్ఫాజ్ భార్య రుక్సానా అదృశ్యమైనట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అతడ్ని ప్రశ్నించారు.
అయితే తన భార్య బీహార్‌లోని స్వగ్రామానికి వెళ్లినట్లు ఇర్ఫాజ్ తెలిపాడు. ఆమె మొబైల్ ఫోన్ వాడటం లేదని చెప్పాడు. మరింతగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇర్ఫాజ్ను అనుమానించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్యను హత్య చేసినట్లు ఇర్ఫాజ్ ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

