Supreme Court | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ‘సుప్రీం’ నోటీసులు..! ఆ విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచన..!
Supreme Court | రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అన్న అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ మేరకు అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Supreme Court | రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అన్న అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ మేరకు అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. వారంలోగా ఈ విషయంలో స్పందన చెప్పాలని ఆదేశించింది.
ఈ అంశం రాష్ట్రానికి మాత్రమే కాదని.. దేశానికి సంబంధించిన విషయాన్ని గమనించాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ విషయంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. నిర్దిష్ట గడువులోగా బిల్లులపై నిర్ణయం చెప్పాలని.. మూడు నెలల్లోగా ఆమోదించడమే.. తిరస్కరించడమో చేయాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత సైతం ఇలాగే చేస్తూ మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
రాజ్యాంగ అధికరణం 142 ప్రకారం.. న్యాయ సమీక్ష చేసేందుకు సంపూర్ణ అధికారం సుప్రీం కోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, సుప్రీం కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి తీవ్రంగా స్పందించారు. అయితే, రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు సంధించారు. తాజాగా అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

