Supreme Court: ఎన్నికల వేళ ఉచిత హామీలు.. 2 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
Supreme Court: ఓటర్లకు ఉచితాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. కేంద్రంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలకు నోటీసు ఇచ్చింది. మళ్లీ నాలుగు వారాల్లో ఈ కేసుపై విచారణ చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ: పన్నుదారుల డబ్బుతో ఓటర్లకు ఉచితాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను విచారించింది. ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు రాష్ట్రాలు తమ ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత ప్రకటనలు చేస్తున్నాయని పిల్లో ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఓటర్లకు డబ్బును పంపిణీ చేయడం దారుణమని, ఎన్నికల వేళ ప్రతిసారి ఇదే జరుగుతోందని, పన్నుదారులపై ఆ భారం పడుతుందని పిల్ తరపున న్యాయవాది వాదించారు. ఉచిత హామీలను వ్యతిరేకిస్తూ భట్టూలాల్ జైన్ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

