IIT-BHU: విద్యార్థిని కిస్ చేసి, దుస్తులు చింపేశారు.. బనారస్ వర్సిటీలో ఆందోళన
IIT-BHU: బనారస్ ఐఐటీలో ఓ మహిళా స్టూడెంట్ను వేధించారు. కిస్ ఇచ్చి ఆమె దుస్తుల్ని చింపేశారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. క్యాంపస్‌లోకి ఎంటరైన బయటి వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లక్నో: వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ లో ఉన్న ఐఐటీ(IIT-BHU) వద్ద వందల సంఖ్యలో విద్యార్థులు నిరసన చేపట్టారు. హాస్టల్ వద్ద విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఓ మహిళా విద్యార్థిని కిస్ చేసి, బట్టలు లాగేసిన ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బైక్‌పై క్యాంపస్‌లోకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ నీచ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బయటి వ్యక్తుల భాగస్వామ్యం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. క్యాంపస్‌లోకి ఎంటర్ కాకుండా బయటి వ్యక్తులపై నిషేధం విధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బీహెచ్‌యూ క్యాంపస్ నుంచి ఐఐటీ క్యాంపస్‌ను వేరు చేయాలని, మధ్యలో గొడ కట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు కాలేజీ యాజమాన్యం పేర్కొన్నది. యూనివర్సిటీలో సెక్యూర్టీని పటిష్టం చేస్తామని, మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేయనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యార్థుల కదలికలపై కూడా ఆంక్షలు విధించనున్నారు.
మహిళా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది. బుధవారం రాత్రి ఆమె తన ఫ్రెండ్‌తో బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై దాడి జరిగింది. కర్మన్ బాబా ఆలయం వద్ద ఉన్న సమయంలో.. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చారని, బలవంతంగా తనను ఓ కర్నార్కు తీసుకువెళ్లారని, ఆ తర్వాత తనను తన ఫ్రెండ్ నుంచి వేరు చేసినట్లు ఆమె తెలిపారు. ఆ ముగ్గురు నిందితులు బాధిత మహిళలను వివస్త్ర చేశారని, ఆమె వీడియోను తీశారని, ఫోటోలను కూడా క్లిక్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 నిమిషాల తర్వాత ఆ మహిళా విద్యార్థిని వదిలేసినట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నట్లు ఫిర్యాదులో ఉంది. ఈ ఘటన పట్ల దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
Three men on a bullet ambushed an IIT BHU student walking with her male friend in BHU campus, Varanasi. The men forcibly kissed the girl student, undressed and recorded her. She was held captive for 10-15 minutes. Hundreds of students of IIT BHU are now staging protest. pic.twitter.com/UVqTlHhAYc
— Piyush Rai (@Benarasiyaa) November 2, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BHU campus
- IIT-BHU
- Kissed
- stripped
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

