ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను దారుణంగా కరిచిన కుక్క
బాలికపై కుక్క దాడి చేస్తున్న సమయంలో స్కూటర్‌పై అటుగా వెళ్లిన వ్యక్తి దీనిని చూసినప్పటికీ ఏ మాత్రం పట్టనట్లుగా వెళ్లిపోయాడు.
అహ్మదాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను వీధి కుక్క దారుణంగా కరిచింది. ఆ చిన్నారి చెంపను చీల్చింది. తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. హన్స్‌పురా సొసైటీలో శనివారం ఒక ఇంటి ముందు ఉన్న బాలిక రింగ్ ఆట ఆడుతున్నది. ఆమె విసిరిన రింగ్ ఎదురుగా ఉన్న ఇంటి వద్ద పడింది. దానిని తెచ్చుకునేందుకు పరుగెత్తుకుని వెళ్లింది. అప్పుడే అక్కడకు వచ్చిన ఒక కుక్క ఆ బాలికపై దాడి చేసింది. కింద పడిన బాలిక ముఖంపై పలు చోట్ల కరిచింది. ఆ చిన్నారి చెంపను నోటితో చీల్చింది.
కాగా, గమనించిన ఆ బాలిక తల్లి వెంటనే అక్కడకు వచ్చింది. కరుస్తున్న కుక్క బారి నుంచి ఆ చిన్నారిని కాపాడింది. ఈ క్రమంలో బాలిక తల్లిని కూడా ఆ కుక్క కరిచింది. ఆమె గట్టిగా విదిలించడంతో ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలో ఎదురింటి, పొరుగింటి వారు హడావుడిగా బయటకు వచ్చారు. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి ముఖం నిండా కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెప్పారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే బాలికపై కుక్క దాడి చేస్తున్న సమయంలో స్కూటర్‌పై అటుగా వెళ్లిన వ్యక్తి దీనిని చూసినప్పటికీ ఏ మాత్రం పట్టనట్లుగా వెళ్లిపోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

