భోపాల్: భారీ వర్షం, బలమైన గాలులకు పూరింటి పైకప్పు ఊగిపోయింది. దానిని పట్టుకున్న వ్యక్తి, పిల్లలు ఆ పైకప్పుతో సహా గాలిలోకి ఎగిరిపడ్డారు. (Man, Children Blown Away With Roof) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. ఓకల్ ప్రాంతానికి చెందిన అమోల్ నాగవంశీ తన పిల్లలతో కలిసి పూరింట్లో ఉన్నాడు. అయితే బలమైన గాలులకు అతడి ఇంటి పైకప్పు ఊగిపోయింది. దీంతో అది ఎగిరిపోతుందేమోనని వారు భయపడ్డారు.
కాగా, అమోల్, అతడి పిల్లలు ఇంటి పైకప్పు కర్రలను పట్టుకుని ఎగురకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో బలమైన గాలి వీచింది. దీంతో దానిని పట్టుకున్న అమోల్, పిల్లలతో సహా కచ్చా ఇంటి పైకప్పు మొత్తం గాలిలోకి ఎగిరి పక్కకు పడింది. అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ పూరిల్లు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఎదురు ఇంటిలోని వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आंधी में घर के छप्पर के साथ उड़े दो बच्चे, मकान भी हुआ तबाह, सागर में हैरान करने वाला वीडियो !!
बुंदेलखंड अंचल इन दिनों भीषण गर्मी और उमस से जूझ रहा है, तापमान में लगातार वृद्धि और तेज धूप के कारण आम जनजीवन प्रभावित हो रहा है !!
इस भीषण गर्मी के बीच राहत की खबर यह है कि पिछले… pic.twitter.com/J5WdmXI4lI
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 22, 2025