Supreme Court | సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆర్డర్ ఆటోమేటిక్‌గా రద్దు కాదు: సుప్రీంకోర్టు
Supreme Court | సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్‌గా రద్దు కావని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: సివిల్, క్రిమినల్ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఉత్తర్వులు ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్‌గా రద్దు కావని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. దిగువ కోర్టుల స్టే ఆర్డర్లను ప్రత్యేకంగా పొడిగించకపోతే అవి రద్దు అవుతాయన్న 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో తాము ఏకీభవించడం లేదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.
కాగా, కేసుల పరిష్కారానికి కాలక్రమాన్ని నిర్ణయించడం రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు, హైకోర్టులు మానుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే అలా చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు వేర్వేరుగా రెండు ఏకకాల తీర్పులను గురువారం ప్రకటించింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆర్డర్ ఆటోమేటిక్‌గా రద్దు కాదని న్యాయమూర్తి ఏఎస్ ఒకా తెలిపారు. అలాగే మార్గదర్శకాలకు సంబంధించి విడిగా, ఏకకాలిక తీర్పును న్యాయమూర్తి పంకజ్ మిథాల్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
Nani | నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. ‘అలియాస్ రుక్మిణీ’ ఈవెంట్లో బయటపడిన పాత సీక్రెట్!
AR Rahman | ‘రాక్‌స్టార్’ పాటలు నచ్చలేదని 8 నెలలు రెమ్యూనరేషన్ ఆపేశారు : ఏఆర్ రెహమాన్ !
Stampede | తొక్కిసలాట జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి.. సురక్షితంగా ఎలా బయట పడాలి..?
Narsapur | నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి : వీడియో
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

