న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఇండేన్ గ్యాస్ ఆన్లైన్ బుకింగ్, సరఫరా వ్యవస్థ గత రెండు రోజులుగా నిలిచిపోయింది. ఐబీఎం ఇండియా నిర్వహిస్తున్న ఈ వ్యవస్థను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. 7718955555 నంబర్‌కు మెసేజ్ చేయడం లేదా ఐవీఆర్ఎస్ ద్వారా లేదా 84549 55555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది. లేదంటే 75888 88824 నంబర్ వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. శుక్రవారం నుంచి సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నది.