పుష్ప సినిమాలోని పాటలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారతదేశం అంతటా మారుమోగిపోతున్నాయి అని చెప్పడానికి ఈ ఘటన ఒక్కటి చాలు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప ఫీవరే పట్టుకుంది. తాజాగా.. ముంబై లోకల్ ట్రెయిన్లో, ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్లలో ఓ వ్యక్తి అచ్చం అల్లు అర్జున్ నడిచినట్టుగా నడవడం.. శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేయడం లాంటివి చేసి అదరగొట్టేశాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి.. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. శ్రీవల్లి పాటను హిందీలో జావెద్ అలీ పాడాడు. ఆ పాట అక్కడ సూపర్ డూపర్ హిట్ కావడంతో చాలామంది ఆ పాటపై మీమ్స్ చేయడం.. డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.