Spike protein: స్పైక్ ప్రోటీన్ వల్లే కోవిడ్ రోగుల్లో జ్ఞాపకశక్తి సమస్యలు
Spike protein: కోవిడ్ సోకిన వారిలో వస్తున్న జ్ఞాపకశక్తి సమస్యలకు స్పైక్ ప్రోటీన్ కారణమని పరిశోధకులు గుర్తించారు. టీఎల్ఆర్4 రిసెప్టార్ వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు తేల్చారు. బ్రెజిల్ వర్సిటీలో ఈ స్టడీ నిర్వహించారు.
న్యూఢిల్లీ: సార్స్ సీవోవీ-2 వైరస్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్(spike protein) వల్ల.. కోవిడ్ రోగుల్లో జ్ఞాపకశక్తి సమస్యలు(memory impairment) ఉత్పన్నం అవుతున్నట్లు ఓ అధ్యయనం ద్వారా తేల్చారు. ఎలుకలపై నిర్వహించిన స్టడీ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. మానవ కణాల్లోకి ప్రవేశిస్తున్న స్పైక్ ప్రోటీన్ వల్ల మనుషుల్లో జ్ఞాపకశక్తి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.
బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జనారో పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మెమోరీ సమస్యలు తలెత్తడానికి కారణం టీఎల్ఆర్4 రిసెప్టార్(TLR4 Receptor) అని కూడా గుర్తించారు. సెల్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో స్టడీ వివరాలను వెల్లడించారు. పోస్టు కోవిడ్ లక్షణాల(post covid symptoms)కు కారమైన అంశాలను ఆ స్టడీలో వివరించారు. ఎలుక మెదడులోకి స్పైక్ ప్రోటీన్‌ను పంపినప్పుడు.. మైక్రోగ్లియా యాక్టివేట్ అయినట్లు పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

