Watch: కొట్టుకున్న కాలేజ్ విద్యార్థులు… ఒకరిని ఢీకొట్టిన కారు, తర్వాత ఏం జరిగిందంటే?
ఒక కాలేజ్‌కు చెందిన రెండు గ్రూపుల విద్యార్థులు రోడ్డుపై కొట్టుకున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఒక విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో అతడు గాల్లో ఎగిరి కారు బోనెట్‌పై అక్కడి నుంచి రోడ్డుపై పడ్డాడు.
లక్నో: ఒక కాలేజ్‌కు చెందిన రెండు గ్రూపుల విద్యార్థులు రోడ్డుపై కొట్టుకున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఒక విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో అతడు గాల్లో ఎగిరి కారు బోనెట్‌పై అక్కడి నుంచి రోడ్డుపై పడ్డాడు. ఆ వెంటనే పైకి లేచిన ఆ విద్యార్థిపై మరో విద్యార్థి దాడి కొనసాగించాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మసూరి ప్రాంతంలోని ఒక కళాశాలకు చెందిన రెండు స్టూడెంట్ గ్రూపుల మధ్య బుధవారం ఘర్షణ తలెత్తింది. విద్యార్థులు రోడ్డుపై కొట్టుకోగా ఒక కారు వేగంగా వారిపైపు దూసుకొచ్చింది. గమనించిన విద్యార్థులు రోడ్డు పక్కకు పరుగులుతీశారు.
అయితే అదుపుతప్పిన ఆ కారు ఒక విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి ఆ కారు బోనెట్‌పై పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి జారి రోడ్డుపై పడ్డాడు. తిరిగి పైకి లేచిన ఆ విద్యార్థి చెంపలపై మరో విద్యార్థి కొట్టాడు. పోలీసులు రావడం చూసిన విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఘర్షణకు దిగిన విద్యార్థుల్లో కొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు ఘజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు. ఒక విద్యార్థిని ఢీకొట్టిన కారును కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. మిగతా విద్యార్థుల కోసం వెతుకుతున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | UP: A clash broke out between two groups of a college under Masuri PS limits yesterday. A viral video on the matter depicted a few boys thrashing each other even after a car rams into them. Few of these boys were taken into custody yesterday: SP Rural Ghaziabad Iraj Raja pic.twitter.com/VTRmKaanyO
— ANI (@ANI) September 22, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

