Gang rape |దుంకా: జార్ఖండ్‌లోని దుంకా జిల్లాలో దారుణం చోటుచేసుకొన్నది. స్పెయిన్‌కు చెందిన మహిళపై కొంత మంది యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు శనివారం వెల్లడించారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. స్పెయిన్‌కు చెందిన జంట అంతర్జాతీయ టూర్లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ద్విచక్ర వాహనంపై దుంకా వచ్చారు.
వీరు హన్సిదిహా పోలీసుస్టేషన్ పరిధిలోని కురుమహత్‌లో శుక్రవారం రాత్రి ఒక గుడారంలో ఉండగా.. అక్కడకు వచ్చిన నిందితులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలిని స్థానిక దవాఖానలో చేర్పించామని, ఘటనపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామని పోలీసు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. బాధిత మహిళపై 7-8 మంది స్థానిక యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తున్నదని మరో అధికారి చెప్పారు.