Monsoon | శుభవార్త చెప్పిన ఐఎండీ..! జూన్ ఒకటిన కేరళను తాకనున్న రుతుపవనాలు..!
Monsoon | దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయని.. ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ నాటికి సాధారణంగా కేరళను తాకే అవకాశాలున్నాయని చెప్పింది.
Monsoon | దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయని.. ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ నాటికి సాధారణంగా కేరళను తాకే అవకాశాలున్నాయని చెప్పింది. జులై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని చెప్పింది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే ముందగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గతవారం ఐఎండీ జూన్ ఒకటి లేదంటే ముందుగా మే 27న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది.
రుతుపవనాలు అండమాన్ మీదుగా కేరళను తాకుతూ వర్షాలను కురిపిస్తూ ముందుకు సాగుతాయని పేర్కొంది. వాస్తవానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాల సీజన్ కొనసాగుతుంది. గతేడాది జూన్ రెండోవారంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళను తాకాయి. ఈ ఏడాది జూన్ ఒకటి నాటికే అంటే సాధారణ సమయానికే కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక రుతుపవనాల సీజన్లో వర్షాపాతం సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ గత నెలలో వెల్లడించింది. ఎల్పీఏలో 106శాతం వరకు వర్షాపాతం రికార్డయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. నైరుతి రుతుపవనాల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని ఐఎండీ పేర్కొంది. అయితే, గతేడాది ఎల్పీఏలో 94.4శాతమే నమోదు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76MD | ఇండియన్ ఎయిర్ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

