SCR Special Trains | దసరా కోసం ఎస్సీఆర్ స్పెషల్ ట్రైన్స్..
SCR Special Trains | దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

SCR Special Trains | దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 22 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్ల వివరాలను ఎస్సీఆర్ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, రైలు నంబర్, ఏ స్టేషన్లో ఎన్ని గంటలకు బయల్దేరుతుంది.. గమ్యస్థానానికి చేరే సమయమెంత? తదితర వివరాలను సదరు ట్వీట్లో వెల్లడించరు. గతేడాది లాక్డౌన్ తరువాత రైల్వేలు పూర్తిస్థాయిలో రైలు సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. రెగ్యులర్ సర్వీసులనే స్పెషల్ సర్వీసులుగా నడిపిస్తున్నది.
సికింద్రాబాద్-నర్సాపూర్ రైలు గురువారం రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ రైలు గురువారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరిగి సోమవారం ఉదయం 8.25 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు గురువారం రాత్రి 7.40 గంటలకు బయలుదేరుతుంది. పండుగ తర్వాత కూడా పలు సర్వీసులను నడుపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dussera
- Special trains
RELATED ARTICLES
తాజా వార్తలు
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

