Sonia Gandhi | సోనియా గాంధీ ఆస్తుల విలువ రూ.12 కోట్లు.. సొంత కారు లేదు
Sonia Gandhi | కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆస్తుల విలువ రూ.12 కోట్లు. ఆమెకు సొంత కారు లేదు. తొలిసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియా గాంధీ తన ఆస్తులు, ఇతర వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆస్తుల విలువ రూ.12 కోట్లు. ఆమెకు సొంత కారు లేదు. తొలిసారి రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియా గాంధీ తన ఆస్తులు, ఇతర వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తం ఆస్తులు రూ.12.53 కోట్లుగా ప్రకటించారు. ఇటలీలోని తండ్రి ఇంటి ఆస్తిలో వాటా విలువ రూ.27 లక్షలని తెలిపారు. అలాగే 88 కేజీల వెండి, 1,267 గ్రాముల బంగారం, ఆభరణాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలోని డేరా మండి గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఎంపీ జీతం, రాయల్టీ ఆదాయం, మూలధన లాభాలు వంటివి తన ఆదాయమని చెప్పారు. తన వద్ద రూ.90,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 నాటి ఎన్నికల అఫిడవిట్లో మొత్తం ఆస్తుల విలువ రూ.11.82 కోట్లుగా ఆమె వెల్లడించారు.
కాగా, ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న విద్యార్హతల ప్రకారం సోనియా గాంధీ 1964లో సియానాలోని ఇస్టిటుటో శాంటా థెరిసాలో ఇంగ్లీష్, ఫ్రెంచ్‌లో మూడు సంవత్సరాల విదేశీ భాషల కోర్సు పూర్తి చేశారు. 1965లో కేంబ్రిడ్జ్‌లోని లెనాక్స్ కుక్ స్కూల్లో ఇంగ్లీష్‌లో సర్టిఫికేట్ కోర్సు చేశారు. సోనియా గాంధీకి వ్యక్తిగతంగా కారు లేదు. అలాగే సోషల్ మీడియా ఖాతా కూడా లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

