Chennai | చెన్నైలో డీఎంకే మహిళా హక్కుల కాన్ఫరెన్స్.. ఎవరెవరు హాజరయ్యారంటే..
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే (DMK) ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్ (Women's Rights Conference) జరుగుతున్నది.
చెన్నై: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే (DMK) ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్ (Women’s Rights Conference) జరుగుతున్నది. చెన్నైలో (Chennai)జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న వారిని సీఎం స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమోళి సాధరంగా ఆహ్వానించారు.
సమావేశానికి సీఎం స్టాలిన్ అధ్యక్షత వహిస్తున్నారు. పార్లమెంటుతోపాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ మహిళా నాయకులతోపాటు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నాయకులను డీఎంకే ఎంపీ కనిమోళి ఆహ్వానాలు పంపించారు.

Chennai
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CM Stalin
- Congress
- DMK
- MP Kanimozhi
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

