చైనాతో భద్రతకు ముప్పు.. ఆ సైనికులు ఇప్పట్లో తిరిగిరారు

న్యూఢిల్లీ: భారత్ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా మారిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. దేశ సరిహద్దుల్లోకి రక్షణ నిమిత్తం పంపిన వేలాది మంది సైనికులు, ఆయుధాలు ఇప్పట్లో తిరిగి బేస్ క్యాంపునకు తిరిగిరాలేవని ఆయన స్పష్టం చేశారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం ఇప్పట్లో జరగదని, ఆ సమస్య పరిష్కారంలో అపనమ్మకం, అనుమానాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. రెండు దేశాల సైనికుల మధ్య ఇటీవల జరిగిన 13వ దఫా చర్ఛలు విఫలం అయిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నది. బోర్డర్ నుంచి ఎలా దళాలను వెనక్కి రప్పించాలన్న అంశంపై రెండు దేశాలు సమాలోచనల్లో పడ్డాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత సరిహద్దు వెంట రెండు దేశాలు మౌళికసదుపాయాలు పెంచుకుంటున్నాయి. దళాలు, సైనిక ఆయుధాలు అక్కడకు చేరుకుంటున్నాయి. అయితే సరిహద్దుల్లో జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని బిపిన్ తెలిపారు. ఎల్ఏసీ వెంట చైనా గ్రామాలను నిర్మిస్తోందని, వివాదాస్పద బౌండరీ వద్ద ఆ నిర్మాణాలు జరుగుతున్నట్లు రావత్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

