వంటింట్లో వాడుకొనే సోలార్ స్టౌ
సౌరశక్తితో నడిచే ఇండోర్ కుకింగ్ స్టౌవ్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తయారు చేసింది. దీన్ని వాడాలంటే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. కిచెన్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు
తయారుచేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
న్యూఢిల్లీ, జూన్ 22: సౌరశక్తితో నడిచే ఇండోర్ కుకింగ్ స్టౌవ్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తయారు చేసింది. దీన్ని వాడాలంటే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. కిచెన్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు. పొద్దంతా సౌరశక్తిని నిల్వ చేసుకోవడం ద్వారా రాత్రి కూడా ఇది పనిచేస్తుంది. దీనిని రీచార్జ్ కూడా చేసుకోవచ్చు.
ఈ సోలార్ స్టౌ పేరు ‘సూర్య నూతన్’. బుధవారం కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధికారిక నివాసంలో ఈ స్టౌపైనే అన్నం వండారు. స్టౌ సోలార్ ప్యానెళ్లు ఇంటి కప్పుపై ఉంటాయి. ఇవి సౌరశక్తిని గ్రహించి కేబుళ్ల ద్వారా స్టౌవ్‌కు పంపుతాయి. స్టౌవ్ లో సౌరశక్తి నిల్వ అవుతుంది. త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్నది. ప్రస్తుతం స్టవ్ ధర రూ.18-రూ.30వేలు. సబ్సిడీతో రూ.10-రూ.12 వేల దాకా ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

