Solar Eclipse | వినీలాకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం..! భారత్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుందా..?
Solar Eclipse | రేపు వినీలాకాశంలో అద్భుతం ఆవిష్కృ తం కాబోతున్నది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ సమయం పాటు గ్రహణం దర్శనమివ్వనున్నది.
Solar Eclipse | రేపు వినీలాకాశంలో అద్భుతం ఆవిష్కృ తం కాబోతున్నది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సుదీర్ఘ సమయం పాటు గ్రహణం దర్శనమివ్వనున్నది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డురావడంతో భూమిపై నీడపడుతుంది. దీన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి రానున్నాయి. ఈ సూర్యగ్రహణం ముందుగా మెక్సికో, అమెరికా, కెనడాలో కనిపించనున్నది. అయితే, భారత్లో మాత్రం కనిపించదని ఖగోళశాస్త్రవేత్తలు తెలిపారు.
భారత కాలమానం ప్రకారం.. సంపూర్ణ సూర్యగ్రహణం సోమవారం రాత్రి 9.12 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10.08 గంట వరకు గ్రహణం సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. 9న తెల్లవారు జామున 2.22 గంటలకు గ్రహణం పూర్తవుతుంది. దాదాపు నాలుగు గంటలకుపైగా గ్రహణం కొనసాగనున్నది. సోమవారం ఏర్పడనున్న గ్రహణం అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన గ్రహణం 50 సంవత్సరాల కిందట కనిపించింది. ఇదిలా ఉండగా.. ఖగోళ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 11.07గంటలకు కనిపిస్తుంది.
టెక్సాస్, ఓక్లహోమా, అర్కాన్సాస్, మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటుకీ, ఇండియానా, ఒహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్, వెర్మోంట్, న్యూ హాంప్షైర్, మైనేతో సహా అనేక అమెరికా రాష్ట్రాలలో గ్రహణం కనువిందు చేయనుంది. మిచిగాన్తో పలు ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపించనున్నది. మెక్సికో నుంచి కెనడాలోకి ప్రవేశించి దక్షిణ అంటారియో, క్యూబెక్, న్యూ బ్రున్స్విక్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, కేప్ బ్రెటన్ తదితర ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే, ఈ గ్రహణం భారత్లో కనిపించదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- April 8
- India
- live stream
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

