డిజిటల్ ఇండియాతో టెక్నాలజీలో దూసుకెళ్తున్నాం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో టెక్నాలజీ అనుకరణలో దేశంలో చాలా వేగంగా ముందుకు వెళ్లిందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అనేక రాష్ట్రాలు పలు స్కీమ్‌లను నిర్వహిస్తున్నాయి. ఆ స్కీమ్‌ల లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. యూపీలోని దీక్షా స్కీమ్ లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ.. ఆవిష్కరణ కోసం ఆసక్తి ఉంటే.. టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకోవచ్చు అని తెలిపారు. 21వ శతాబ్ధపు భారత నినాదం డిజిటిల్ ఇండియా అని ఆయన అన్నారు.
కోవిడ్ వేళ డిజిటిల్ ఇండియా ఎంత సమర్థవంతంగా పనిచేసిందో చూశామన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు విఫలమైన వేళ.. మనం నేరుగా ఖాతాల్లోకి అమౌంట్‌ను బదిలీ చేశామన్నారు. ఆ అమౌంట్ సుమారు 7 లక్షల కోట్లు ఉంటుందన్నారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా మౌళిక సదుపాయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లు ప్రధాని తెలిపారు. అనేక ప్రపంచదేశాలు కోవిన్ పోర్టల్ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. కోవిన్ ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ .. మన టెక్నాలజీ సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఆన్లైన్ విద్య, వైద్య కోసం డెవలప్ చేసిన ఫ్లాట్‌ఫామ్స్ కోట్లాది మంది భారతీయులకు ఉపయోగపడినట్లు ఆయన చెప్పారు. డిజిలాకర్ ద్వారా డిజిటిల్ ఇండియా సామర్థ్యం తెలుస్తుందన్నారు. స్కూల్, కాలేజీ డాక్యుమెంట్లు, ఆధార్, ప్యాన్, ఓటర్ కార్డులను డిజీలాకర్‌లో ఈజీగా దాచుకోవచ్చు అన్నారు. డిజిటల్ ఇండియా వల్లే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు సాధ్యమైందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

