వ్యాపారి ఇంట్లో బాణాసంచా పేలుడు.. ఆరుగురు మృతి
పాట్నా : బిహార్ సరన్ జిల్లాలో ఆదివారం భారీ పేలుడు చోటు చేసుకున్నది. చాప్రాలోని ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు భవనం శిథిలాల కింద మరో పదిమంది వరకు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. వ్యాపారి ఇంట్లో బాణాసంచ తయారు చేస్తున్న సమయంలో బాణాసంచ పేలినట్లుగా తెలుస్తున్నది. బాణాసంచా పేలుడు శబ్దాలు దాదాపు గంటకుపైగా వినిపించాయని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న అధికారులు భవనం శిథిలాల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సరన్ ఎస్పీ సంతోష్‌కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను సైతం రంగంలోకి దింపారు. ఖైరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖుదాయి బాగ్గ్రామంలో షబ్బీర్ హుస్సేన్ అనే వ్యక్తి ఇంట్లో బాణాసంచా పేలుడు సంభవించిందని ఎస్పీ పేర్కొన్నారు. పేలుడు ధాటికి భవనంలోని ఓ భాగం ఎగిరిపోగా.. మిగతా భాగమంతా అగ్నికీలలకు ఆహుతైంది.
Bihar | Six people dead after a house collapsed due to a blast in Chhapra. Efforts are being made to rescue people trapped under the debris. We’re investigating the reason behind the explosion. Forensic team and Bomb disposal squad have also been called: Santosh Kumar, Saran SP pic.twitter.com/bCJgEMgZHf
— ANI (@ANI) July 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

