NEET Issue | విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఎన్టీఏ రద్దు : సీతారాం ఏచూరి డిమాండ్
NEET Issue : నీట్ రగడ, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలతో పాటు యూజీసీ-నెట్ ఎగ్జాం రద్దు వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు.
NEET Issue : నీట్ రగడ, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలతో పాటు యూజీసీ-నెట్ ఎగ్జాం రద్దు వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు.
నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన వ్యక్తుల గురించి రాజకీయాల్లో మనం విన్నామని, ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఈ తరహా నిర్ణయానికి దూరంగా ఉన్నారని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ సుస్పష్టమని, వీటిని బహిరంగంగా విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్ధలో ఈ రకమైన వాణిజ్య ధోరణులు ప్రబలుతున్నాయని చెప్పారు. ఈ అక్రమాలతో కోట్లాది మంది మన విద్యార్ధులు బలి అవుతున్నారని అన్నారు. దేశ భవిష్యత్‌కు కీలకమైన యువత భవితకు భరోసా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షల అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.
Read More :
Sniper Killed: ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హమాస్ స్నైపర్ హతం.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

