కొవిడ్ టీకాలతో దుష్ప్రభావాలు
కొవిడ్ టీకాలతో పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సమాచార హక్కు చట్టం కింద పుణేకు చెందిన వ్యాపారి ప్రఫుల్ సర్దా అడిగిన ప్రశ్నకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)
- అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం
- సమాచార హక్కు చట్టం కింద వెల్లడి
ముంబై, జనవరి 16: కొవిడ్ టీకాలతో పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సమాచార హక్కు చట్టం కింద పుణేకు చెందిన వ్యాపారి ప్రఫుల్ సర్దా అడిగిన ప్రశ్నకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్‌వో) ఈ మేరకు సమాధానమిచ్చాయి.
ప్రస్తుతం అస్ట్రాజెనెకా-సీరం సంస్థకు చెందిన కొవిషీల్డ్, సీరం సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన కొవొవ్యాక్స్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ, బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కార్బీవాక్స్, క్యాడిలా సంస్థ తయారుచేసిన జైకోవ్ డీ టీకాలకు కేంద్రం అనుమతించింది.
దుష్ప్రభావాలు ఇలా..
కొవిషీల్డ్: టీకా వేసిన చోట నొప్పి, దద్దుర్లు, కారణాల్లేకుండానే వాంతులు, పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, కాళ్ల నొప్పి, పక్షవాతం, మూర్ఛ, కండ్లలో నొప్పి, చూపు మందగించడం, మానసిక స్థితిలో మార్పు
కొవాగ్జిన్: టీకా వేసిన చోట నొప్పి, తలనొప్పి, జ్వరం, అలసట, ఒళ్లునొప్పులు, పొత్తికడుపులోనొప్పి, వికారం, వాంతులు, జలుబు, దగ్గు, కళ్లు తిరగడం, వణుకు
కొవొవ్యాక్స్: ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, దురద, అలసట, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, ఒళ్లునొప్పులు, శక్తిలేకపోవడం, వెన్నునొప్పి, కళ్లుతిరగడం
స్పుత్నిక్ వీ: జ్వరం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పి, శక్తిలేకపోవడం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, టీకా వేసిన చోట నొప్పి
కార్బీవ్యాక్స్: టీకావేసిన చోట నొప్పి, జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లునొప్పులు, కండరాలనొప్పి, వికారం, దద్దుర్లు, నిద్రమత్తు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

