పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సిద్దూ

సీఎం అమరీందర్ వ్యతిరేకించినా నియమించిన సోనియా
న్యూఢిల్లీ, జూలై 18: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్దూను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం నియమించారు. రాష్ట్ర సీఎం అమరీందర్ తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ సోనియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షుడు సునీల్ జఖర్ స్థానంలో సిద్దూ బాధ్యతలను స్వీకరించారు. సిద్దూకు సహాయంగా సంగత్సింగ్, సుఖ్వీందర్ సింగ్, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సోనియా నియమించారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కొంత కాలంగా సిద్దూ, అమరీందర్ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సిద్దూ సొంత పార్టీ నాయకుడు అమరీందర్పైనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తిరుగుబాటు జెండా ఎగురవేసి తనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో విభేదాలకు చెక్ పెట్టేందుకు సోనియా రంగంలోకి దిగారు. అయితే పార్టీ అధిష్ఠానం తాజా నిర్ణయం వివాదాలను తగ్గించకపోగా మరింత పెంచవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

