Watch: అంతర్జాతీయ బేకరీ షాపు సిబ్బందిపై కాల్పులకు యత్నం.. గన్ ఫెయిల్ కావడంతో వ్యక్తి పరార్
Shootout Bid At Bakery | అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్లెట్ సిబ్బందిపై కాల్పులకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. (Shootout Bid At Bakery) అయితే గన్ ఫైర్ కాకపోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
ముంబై: అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్లెట్ సిబ్బందిపై కాల్పులకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. (Shootout Bid At Bakery) అయితే గన్ ఫైర్ కాకపోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో ప్రముఖ కాషిమిరా ప్రాంతంలోని అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్లెట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ముఖానికి హెల్మెట్ పెట్టుకున్న అతడు గన్ ఎక్కుపెట్టి అక్కడున్న సిబ్బందిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే గన్ ఫెయిల్ కావడంతో ఫైర్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్లెట్ సిబ్బందిపై కాల్పులకు ఆ వ్యక్తి ఎందుకు ప్రయత్నించాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Daylight Shootout Bid at Bakery in Kashimira, Mira-Bhayandar. Close Shave for Staffers as Shooter’s Gun Fails to Fire.
By: Suresh Golani#Mumbai #Shooting #BREAKING #MiraBhayandar #Viral #FPJ pic.twitter.com/sHxpS8Y20j
— Free Press Journal (@fpjindia) October 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bakery
- Fails To Fire
- Gun
- Kashimira
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

