Sharad Pawar Meets Shinde | సీఎం ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ
Sharad Pawar Meets Shinde | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ సోమవారం కలిశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ సోమవారం కలిశారు. (Sharad Pawar Meets Shinde) ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. సాగునీరు, పాల ధరలు, చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే మరాఠా కోటా, ఓబీసీ నిరసనలపై కూడా సీఎం ఏక్నాథ్ షిండే, శరద్ పవార్ మధ్య చర్చలు జరిగి ఉంటాయని తెలుస్తున్నది.
కాగా, మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అనుచరుడు ఛగన్ భుజ్‌బల్ ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్‌ను ఇటీవల కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన భుజ్‌బల్ మరాఠా కోటా, ఓబీసీ నిరసనలపై చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని శరద్ పవార్‌ను కోరారు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఓబీసీల సమస్యలను పరిష్కరించారని ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. అందుకే ఇప్పుడు ఆయన జోక్యాన్ని కోరినట్లు చెప్పారు. సీఎం ఏక్నాథ్ షిండే, రాష్ట్రంలోని ఇతర ముఖ్య నేతలతో చర్చించడానికి ఆయన అంగీకరించారని అన్నారు.
మరోవైపు ఆదివారం మహారాష్ట్రలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంవీఏ కూటమి నేతలపై విమర్శలు చేశారు. దేశంలో అవినీతిని సంస్థాగతీకరించిన రింగ్ లీడర్ శరద్ పవార్ అని అభివర్ణించారు. ఉద్ధవ్ ఠాక్రేను ‘ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్ అధినేత’ గా పేర్కొన్నారు. అమిత్ షా విమర్శల మరునాడే సీఎం ఏక్నాథ్ షిండే, శరద్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

