Kanpur Road Accident | స్కూల్ వ్యాన్, లారీ ఢీ.. పలువురు విద్యార్థులకు గాయాలు
Kanpur Road Accident | లారీని స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులోని విద్యార్థులంతా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
లక్నో: లారీని స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులోని విద్యార్థులంతా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. (Kanpur Road Accident ) గురువారం మధ్యాహ్నం హైవేపై వెళ్తున్న స్కూల్ వ్యాన్, లారీ ఢీకొన్నాయి. దీంతో వ్యాన్‌లో ఉన్న విద్యార్థులంతా గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్‌లను రప్పించారు. స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లోకి చేర్చి ఆసుపత్రికి తరలించారు. కొందరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాన్పూర్‌లోని జీపీఆర్డీ కాలేజీకి చెందిన వ్యాన్‌గా గుర్తించారు.
కాగా, రోడ్డు ప్రమాదం జరిగిన చోట పరిస్థితి భయంకరంగా ఉంది. పిల్లల స్కూల్ బ్యాగులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అక్కడ అంతటా రక్తం మరకలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
कानपुर के अरौल में स्कूली बच्चों को लेकर जा रही गाड़ी ट्रक से टकराई। कई बच्चों के घायल होने की खबर। #Kanpur #RoadMishap @NBTLucknow pic.twitter.com/q36tQgDsHj
— Praveen Mohta (@MohtaPraveenn) February 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Children
- Hits
- Injured
- school van
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

