Serum on Covovax | కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కొవోవాక్స్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కోరింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ వాడకానికి మంజరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో కొవోవ్యాక్స్ ఉత్పత్తికి అనుమతించాలని అభ్యర్థించింది.
ఈ మేరకు భారత్‌లో వయోజనులపై ఇంటరిం 2,3 క్లినికల్స్ స్టడీ రిపోర్ట్స్, నొవావాక్స్ యూకే, యూఎస్ఏ-మెక్సికో త్రీ-ఫేజ్ క్లినికల్ స్టడీ నివేదికలను డీజీసీఐ డీజీకి అందజేసినట్లు సీరం తెలిపింది.
కొవొవ్యాక్స్ వ్యాక్సిన్ భద్రత కలిగిందని, యువజనుల్లో రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుందని సీరంలో ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. కొవోవ్యాక్స్ ఉత్పత్తికి అనుమతి ఇస్తే కరోనాపై పోరులో భారత్ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేస్తుందన్నారు.