Maoist Arms Dump | మవోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. బయటపడిన భారీ ఆయుధాల డంప్
భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్‌లను (Maoist Arms Dump) కనుగొంటున్నారు. గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి జిల్లాలో ఆయుధ డంప్ బయటపడిన విషయం తెలిసిందే.
రాయ్‌పూర్: భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్‌లను (Maoist Arms Dump) కనుగొంటున్నారు. గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి జిల్లాలో ఆయుధ డంప్ బయటపడిన విషయం తెలిసిందే. తాజాగా సుక్మా జిల్లాలో కూడా మరో డంప్‌ను భద్రతా బలగాలు కనుగొన్నాయి. జిల్లాలోని దుల్లేడ్, మెట్టుగూడ అటవీ ప్రాంతంలో 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ సిబ్బంది కూంబింగ్ చేపట్టాయి.
ఈ క్రమంలో మెట్టుగూడ గ్రామం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను కనుపెట్టారు. అందులో పరిశీలించగా 21 ఐఈడీలు, మల్టీ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL), ఒక జనరేటర్ సెట్, లాత్ మెషిన్ పరికరాలు, భారీ మొత్తంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామాగ్రి ఉన్నాయి. భద్రతా బలగాలు భారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకోవడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగినట్లయింది.
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చనిపోయిన 16 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. వారిలో దశాబ్దాల పాటు భద్రతా దళాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
Renu Desai | నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?.. ‘మాజీ భార్య’ ట్యాగ్‌పై నటి రేణు దేశాయ్ ఆవేదన
Supreme Court: ఢిల్లీ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా.. చమత్కరించిన సుప్రీంకోర్టు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

