Tamil Nadu Governor | సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్‌లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
Tamil Nadu Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం జరిగిందని ఆయన ఆరోపించారు.
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Tamil Nadu Governor) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. సెప్టెంబరు 22న కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం. లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు’ అని అన్నారు.
కాగా, ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య జరిగిన ఘర్షణ వల్ల సెక్యులరిజం భావన వచ్చిందని గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. అయితే స్వాత్రంత్యం తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఎవరో సెక్యులరిజం గురించి చర్చించారని చెప్పారు. ‘రాజ్యాంగ పరిషత్ ఏం చెప్పింది. మన దేశంలో సెక్యులరిజం ఉందా? ఏదైనా సంఘర్షణ జరిగిందా?’ అని ప్రశ్నించారు. ధర్మం నుంచి భారతదేశం పుట్టిందని, అలాంటప్పుడు ధర్మంలో వైరుధ్యం ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘సెక్యులరిజం అనేది యూరోపియన్ భావన. అది అక్కడే ఉండాలి. భారత్‌లో సెక్యులరిజం అవసరం లేదు’ అని అన్నారు.
మరోవైపు 1976లో రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులరిజం’ అనే పదాన్ని చేర్చిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ సందర్భంగా విమర్శించారు. ‘25 సంవత్సరాల తరువాత, ఎమర్జెన్సీ కాలంలో, అసురక్షిత ప్రధానమంత్రి, కొన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టే ప్రయత్నంలో లౌకికవాదాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు’ అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

