న్యూఢిల్లీ, డిసెంబర్ 11: స్పెయిన్‌లోని పురాతత్వ శాస్త్రవేత్తలు గతంలో కనుగొన్న ఓ డైనోసార్‌కు చెందిన రెండు జతల పాదముద్రలను విశ్లేషించారు. ఆ పాదముద్రల ఆధారంగా దాని వేగాన్ని అంచనా వేశారు. అప్పట్లో ఆ డైనోసార్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తి ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం భూమ్మీద ఉన్న అత్యంత వేగవంతమైన మానవుడు ఉసేన్ బోల్డ్ రేసుల్లో పరుగెత్తే వేగానికి కంటే ఇది ఎక్కువ. డైనోసార్ శరీరం నిర్మాణం, దాని అడుగుల మధ్య దూరాన్ని బట్టి వేగాన్ని అంచనా వేశారు. డైనోసార్ల శరీరం నిర్మాణంలో మార్పులు.. జాతుల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.