Child Porn: చైల్డ్ పోర్న్ కేసులో హైకోర్టు తీర్పును సమీక్షించనున్న సుప్రీంకోర్టు
Child Porn : చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన వీడియోలను డౌన్లోడ్ చేయడం కానీ, వాటిని వీక్షించడం కానీ పోక్సో చట్టం, ఐటీ చట్టం కింద నేరం కాదు అని ఇటీవల మద్రాసు హైకోర్టు పేర్కొన్నది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఇలాంటి పిల్‌ను విచారణకు స్వీకరించడం దారుణమే అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్న్(Child Porn)కు సంబంధించిన వీడియోలను డౌన్లోడ్ చేయడం కానీ, వాటిని వీక్షించడం కానీ పోక్సో చట్టం, ఐటీ చట్టం కింద నేరం కాదు అని ఇటీవల మద్రాసు హైకోర్టు పేర్కొన్నది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఇలాంటి పిల్‌ను విచారణకు స్వీకరించడం దారుణమే అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. తన మొబైల్ ఫోన్లో చైల్డ్ పోర్న్‌కు చెందిన వీడియోలను డౌన్లోడ్ చేసిన కేసులో 28 ఏళ్ల వ్యక్తిపై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అయితే ఆ అభియోగాలను జనవరి 11వ తేదీన చెన్నై హైకోర్టు కొట్టిపారేసింది. దీనిపై ఇప్పుడు సుప్రీం విచారణ చేపట్టనున్నది.
జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. సీనియర్ న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కా ఈ కేసులో పిటీషన్ సమర్పించారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలియన్స్, బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థల తరపున కూడా ఓ సీనియర్ న్యాయవాది వాదించారు. ఈ కేసులో చెన్నైకి చెందిన హరీశ్, ఇద్దరు పోలీసు ఆఫీసర్ల నుంచి రెస్పాన్స్ కోరింది.
పోక్సో చట్టం 2012, ఐటీ చట్టం 2000 కింద హరీశ్ కేసును కొట్టివేస్తున్నట్లు చెన్నై హైకోర్టు తెలిపింది. ఐటీ చట్టంలోని 67-బీ కింద నేరం రజువు కావాలంటే నిందితుడు ఆ కాంటెంట్‌ను పబ్లిష్ చేయడం కానీ, ట్రాన్స్మిట్ చేయం కానీ, పిల్లలతో కొత్త వీడియోలను చేయడం కానీ ఉండాలని పేర్కొన్నది. అందుకే కేవలం చైల్డ్ పోర్న్‌ను వీక్షించడం సెక్షన్ 67-బీ కింద నేరం కాదు అని హైకోర్టు తెలపింది. మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసిన రెండు మైనర్ పిల్లల వీడియోలను ఎవరికీ ట్రాన్స్మిట్ చేయలేదని హైకోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

