ఇటలీ మెరైన్స్పై మర్డర్ కేసు మూసివేత.. జాలర్ల వారసులకు 10 కోట్లు

న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఇద్దరు జాలర్ల హత్య విషయంలో ఇటలీ మెరైన్స్కు చెందిన ఇద్దరిపై ఉన్న క్రిమినల్ కేసును ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ కేసును మూసివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2012 ఫిబ్రవరిలో కేరళ తీరంలో ఇద్దరు మత్స్యకారులను ఇటలీ నావికులు హత్య చేసినట్లు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఇటలీ చేపట్టాలని తన ఆదేశాల్లో సుప్రీం పేర్కన్నది. ఇద్దరు మత్స్యకారులకు కుటుంబాలకు చెరో నాలుగు కోట్లు డిపాజిట్ చేయాలని, బోటు ఓనర్‌కు మరో రెండు కోట్లు ఇవ్వాలని ఇటలీని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. అంతర్జాతీయ కోర్టు ప్రకారం ఈ కేసులో తదుపరి విచారణ ఇటలీ చేపట్టాలని సుప్రీం తెలిపింది. ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లో చేపలు పడుతున్న ఇద్దరు భారతీయ జాలర్లను ఎంవీ ఎన్రికా లెక్సీ ట్యాంకర్ నౌకలో ఉన్న మెరైన్లు చంపేశారు. ఈ ఘటన 2012లో జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

