ఉచితాలను రాష్ట్రాల జీడీపీలో ఒక శాతానికే పరిమితం చేయాలి..! ఎస్బీఐ నివేదిక
SBI report on Freebies | ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఉచితాల’పై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది. సుప్రీం కోర్టు నేతృత్వంలోని కమిటీతో రాష్ట్రాలు ఇచ్చే ఉచితాలను
Freebies | ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఉచితాల’పై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది. సుప్రీం కోర్టు నేతృత్వంలోని కమిటీతో రాష్ట్రాలు ఇచ్చే ఉచితాలను కట్టడి చేయవచ్చని నివేదిక పేర్కొంది. ఆయా సంక్షేమ పథకాలను రాష్ట్రాల జీడీపీలో ఒక శాతం.. లేదంటే రాష్ట్రాలకు వచ్చే పన్నుల్లో ఒక శాతానికి పరిమితం చేయవచ్చని ఎస్బీఐ నివేదికలో పేర్కొంది.
రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు, ప్రభుత్వాలపై వాటి భారంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలో నివేదిక రూపొందింది. ఈ నివేదికలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ల పరిస్థితులను ఉదహరించారు. మూడు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం, పెన్షన్ చెల్లింపుల్లో భారీగా తేడాలున్నట్లు తేలింది.
ఆయా రాష్ట్రాలకు వచ్చే పన్ను ఆదాయం, పెన్షన్ చెల్లింపులను పోల్చి చూసిన సమయంలో జార్ఖండ్ 217, రాజస్థాన్ 190, ఛత్తీస్గఢ్కు 207శాతం అధిక భారం ఉందంటూ నివేదిక పేర్కొంది. పెన్షన్ పథకంలో మార్పుపై ఆలోచిస్తున్న రాష్ట్రాలను చూస్తే వాటి పన్నులు, చెల్లింపుల మధ్య అంతరం ఎక్కువగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.
పాత పెన్షన్ విధానంలోకి తిరిగి వెళ్లాలని యోచిస్తున్న హిమాచల్ ప్రదేశ్లో పన్నుల ఆదాయం, చెల్లింపుల మధ్య 450శాతం, గుజరాత్లో 138, పంజాబ్లో 242 శాతంగా తేడాలుండే అవకాశం ఉందని ఘోష్ నివేదిక పేర్కొంది. తాజా సమాచారం ప్రకారం.. బడ్జెట్ యేతర రుణాలు, ప్రభుత్వరంగ సంస్థలు, గ్యారంటీలతో తీసుకున్న పలు రుణాలు 2022 ఏడాది రాష్ట్రాల జీడీపీలో దాదాపు 4.5శాతానికి చేరుకున్నాయని సౌమ్య క్రాంతి ఘోష్ నివేదిక పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

