damage to Pak’s Nur Khan air base | భారత దాడిలో పాక్ నూర్ ఖాన్ బేస్ ధ్వంసం.. శాటిలైట్ చిత్రాలు స్పష్టం
damage to Pak's Nur Khan air base | భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో పాకిస్థాన్‌లోని కీలకమైన ఎయిర్ బేస్‌లు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రావల్పిండిలోని చక్లాలాలో ఉన్న పాక్ వైమానిక స్థావరం నూర్ ఖాన్‌కు బాగా నష్టం వాటిల్లింది.
న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో పాకిస్థాన్‌లోని కీలకమైన ఎయిర్ బేస్‌లు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. రావల్పిండిలోని చక్లాలాలో ఉన్న పాక్ వైమానిక స్థావరం నూర్ ఖాన్‌కు బాగా నష్టం వాటిల్లింది. (damage to Pak’s Nur Khan air base) చైనా ఉపగ్రహ సంస్థ మిజాజ్విజన్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు దీనిని నిర్ధారించాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు రఫీకి, మురిద్, చునియన్, సుక్కూర్‌లోని పాకిస్థాన్ మానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది.
కాగా, కీలకమైన పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లు, సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అంగీకరించారు. దేశాన్ని ఉద్దేశించి టీవీలో మాట్లాడిన ఆయన, రావల్పిండిలోని నూర్ ఖాన్ బేస్, చక్వాల్లోని మురిద్ బేస్, పంజాబ్ ప్రావిన్స్‌లోని రఫీకి బేస్‌పై భారత క్షిపణుల దాడి జరిగిందని తెలిపారు.
మరోవైపు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉంది. ఆ దేశ ప్రధాన రవాణా స్క్వాడ్రన్లు ఇక్కడ ఉన్నాయి. లాజిస్టిక్, వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్ట్ కార్యకలాపాలకు ఈ బేస్‌ను పాక్ వినియోగిస్తున్నది. సీ-130 హెర్క్యులస్, శాబ్ 2000 వంటి రవాణా విమానాలు, ఐఎల్-78 మిడ్-ఎయిర్ రీఫ్యూయలర్లు, వీఐపీల విమానాలు కూడా ఈ ఎయిర్ బేస్‌లోనే ఉన్నాయి. ఇంతటి కీలకమైన ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు చేయడంతో పాకిస్థాన్ తోకముడిచింది. కాల్పుల విరమణ కోసం భారత్‌తో సంప్రదింపులు జరిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

