నారాయణపూర్‌లో ఎన్కౌంటర్.. మావోల కాల్పుల్లో జవాన్ మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డీఆర్జీ జవాన్ సలిఖ్రామ్ మృతి చెందారు. ఇర్పనార్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుండగా.. ఎదురు కాల్పుల ఘటనను బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ ధ్రువీకరించారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంఓల ఉన్న బర్పూర్ మార్గ్‌లోని కడమెటా – కడేనార్ మధ్య మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న డీఆర్జీ, ఐటీబీపీ సిబ్బంది కూంబింగ్ చేపట్టారు.
ఈ క్రమంలో ఇర్పనార్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోలు భద్రతా సిబ్బందిపై మెరుపుదాడి చేశారు. వెంటనే భద్రతా బలగాలు సైతం తేరుకొని ధీటైన సమాధానం ఇచ్చాయి. మావోల కాల్పుల్లో తీవ్రంగా గాయపడడంతో డీఆర్జీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందారు. భానుప్రతాప్పూర్లో నివాసం ఉంటున్న జవాన్ సలిఖ్రామ్ డీఆర్జీలో ఏఎస్ఐగా నియామకమయ్యారు. ఆయన మృతదేహాన్ని దంతెవాడ మీదుగా అటవీ మార్గంలో మార్గంలో నారాయణపూర్‌కు తరలించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

