Modi-Sachin | సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో భారతీయ క్రికెట్ ఆరాధ్య దైవం..మాస్టర్ బ్లాస్టర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో టాప్-50లో చోటు దక్కించుకున్నారు. కన్జూమర్ ఇంటెలిజెన్స్ కంపెనీ బ్రాండ్ వాచ్ నిర్వహించిన సర్వేలో సచిన్ టెండూల్కర్ 35వ ర్యాంక్ పొందారు.
అమెరికా నటులు డ్యాయ్యే జాన్సన్, లియోనార్డ్ డీ కాప్రియో, అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామాల కంటే టెండూల్కర్ ముందు ఉన్నారు. రూరల్ అండ్ అర్బన్ ఇండియాల్లో హెల్త్, విద్య, ఆటలకు మెరుగైన వసతుల కల్పనకు మద్దతుగా నిలిచారు. అమెరికా సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి ర్యాంక్.. ప్రధాని నరేంద్రమోదీ రెండో ర్యాంక్ పొందారు.