Rajasthan Polls | సీఎం పదవిపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు
రాజస్ధాన్ (Rajasthan Polls) సీఎం రేసులో అశోక్ గెహ్లాట్‌తో మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ తలపడుతుండగా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
జైపూర్ : రాజస్ధాన్ (Rajasthan Polls) సీఎం రేసులో అశోక్ గెహ్లాట్‌తో మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ తలపడుతుండగా పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవిపై సచిన్ పైలట్ స్పందించారు. ఉమ్మడి నాయకత్వం పట్ల పార్టీ మొగ్గుచూపుతుందని, పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నేతలకు ఏయే బాధ్యతలు అప్పగించాలనేది అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు.
తాము సమిష్టిగా ఎన్నికల్లో పోరాడతామని, మెజారిటీ సీట్లు సాధించిన అనంతరం ఎమ్మెల్యేలతో చర్చించిన మీదట హైకమాండ్ పదవులపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ ప్రక్రియపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పార్టీ నాయకత్వంతో చర్చించి పరిష్కరించుకోవచ్చని పైలట్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమను ఆశీర్వదించి పాలనా పగ్గాలు అప్పగిస్తే అందరం కూర్చుని ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
2018లో ఇదే విధానం అనుసరించామని, ఇప్పుడు కూడా దీన్నే అనుసరిస్తామని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. కాగా రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Akhilesh Yadav | యూపీ కార్మికులు సొరంగంలో చిక్కుకుపోతే ఎన్నికల ప్రచారంలో యోగి బిజీ : అఖిలేష్ యాదవ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

