Sabarimala Greenfield Airport: శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు.. 3.4 లక్షల చెట్లు కూల్చేస్తేనే !
Sabarimala greenfield airport : 3.3 లక్షల రబ్బరు, 2492 టేకు, 2247 వైల్డ్ జాక్, 1131 జాక్‌ఫ్రూట్, 828 మహోగని, 184 మామిడి చెట్లను తొలగిస్తేనే శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం సాధ్యం అవుతుందని కొట్టాయం జిల్లా ఓ రిపోర్టును తయారు చేసింది.
తిరువనంతపురం: శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని(Sabarimala greenfield airport) నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. అయితే ఆ విమానాశ్రయం కోసం సుమారు 3.4 లక్షల చెట్లను తొలగించాల్సి ఉంటుందని కొట్టాయం జిల్లాశాఖ ఓ నివేదికను తయారు చేసింది. దీని కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదికను రూపొందించారు. ఒకవేళ ఎయిర్‌పోర్టు నిర్మిస్తే సుమారు 353 కుటుంబాలను తరలించాల్సి వస్తుందని రిపోర్టులో పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం 3.3 లక్షల రబ్బరు, 2492 టేకు, 2247 వైల్డ్ జాక్, 1131 జాక్‌ఫ్రూట్, 828 మహోగని, 184 మామిడి చెట్లను తొలగించాల్సి ఉంటుంది. చెట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ఏడు మతపరమైన ప్రదేశాలను మార్చాల్సి వస్తోందని రిపోర్టులో తెలిపారు. శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు ద్వారా 347 కుటుంబాలు నేరుగా నష్టపోనున్నారు. దీంట్లో 238 కుటుంబాలు చెరువెల్లి ఎస్టేట్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడే చెరువెల్లి జాతి ఆవు కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఎస్టేట్‌ను మార్చేస్తే, అప్పుడు ఆవుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని రిపోర్టులో వెల్లడించారు.
శబరిమల విమానాశ్రయం కోసం 1039.876 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. ఆ భూమిని మణిమాల, ఎరుమేలి సౌత్ గ్రామాల నుంచి సేకరించనున్నారు. శబరిమల యాత్రికులు, ఎన్ఆర్ఐలు, పర్యాటకులు, ఇతర ప్రయాణికుల ఉద్దేశంతో కేఎస్ఐడీసీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. శబరిమల ఎయిర్‌పోర్టుతో ట్రావెన్కోర్ యాత్రా స్థలాలకు వెళ్లే మార్గాలకు దారి సులువు అవుతుంది. వావరు మసీదు, మారమన్ కన్వెన్షన్, ఎటుమన్నూర్ మహాదేవ ఆలయం లాంటి ప్రదేశాలకు యాక్సిస్ పెరుగుతుంది. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ బలపడనున్నది. టూరిస్టుల సంఖ్య పెరగనున్నది. కుమరొక్కం బ్యాక్‌వాటర్స్, మున్నార్ హిల్ స్టేషన్స్, గావి ఫారెస్ట్, టెక్కడీ వైల్డ్‌లైఫ్ సాంక్చరీ, పెరియార్ టైగర్ రిజర్వ్, ఇడుక్కి డ్యామ్‌కు లింకు రోడ్డు ఈజీ అవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

