స్పుత్నిక్ వీ టీకా ఆర్డర్లు రద్దు..

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు.. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాల ఆర్డర్లను రద్దు చేశాయి. ప్రభుత్వం ఉచిత టీకాలు ఇస్తున్న నేపథ్యంలో.. విదేశీ టీకాలకు డిమాండ్ తగ్గింది. అంతేకాదు స్పుత్నిక్ టీకాలను నిల్వ చేయాలంటే అతిశీతల వాతావరణం అవసరం ఉంటుంది. దీంతో మూడు అతిపెద్ద హాస్పిటళ్లు స్పుత్నిక్ వీ టీకాల ఆర్డర్లను రద్దు చేశాయి. పుణెలోని భారతీ విద్యాపీఠ మెడికల్ కాలేజీ సుమారు 2500 టీకా డోసుల ఆర్డర్‌ను రద్దు చేసినట్లు మెడికల్ ఆఫీసర్ జితేంద్ర ఓస్వాల్ తెలిపారు. టీకాలకు డిమాండ్ తక్కువగా ఉందని, ఒక శాతం మాత్రమే స్పుత్నిక్ కావాలని జనం అడుగుతున్నారని ఆయన అన్నారు.
మే నెల నుంచి గత వారం వరకు ఇండియాలోని ప్రైవేటు హాస్పిటళ్లు కేవలం ఆరు శాతం మాత్రమే కోవిడ్ టీకాలను వేశాయి. ప్రైవేటు హాస్పిటళ్లకు 25 శాతం టీకాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇండియాలో స్పుత్నిక్ వీ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటి వరకు 9.43 లక్షల స్పుత్నిక్ వీ టీకాలను ప్రైవేటు హాస్పిటళ్లు పంపిణీ చేశాయి. స్పుత్నిక్ టీకాలను నిల్వ చేయాలంటే మైనస్ 18 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగత్రలు ఉండాలి. ఇక ప్రైవేటు మార్కెట్లో ఆస్ట్రాజెనికా టీకా ధర కన్నా.. స్పుత్నిక్ టీకా ధర 47 శాతం ఎక్కువగా ఉంది.
హైదరాబాద్‌లో 8 వ్యాక్సినేషన్ సెంటర్ల నడుపుతున్న అవిస్ హాస్పిటళ్లు కూడా సుమారు పది వేల స్పుత్నిక్ టీకాల ఆర్డర్‌ను రద్దు చేశాయి. పుణెకు చెందిన మరో కంపెనీ కూడా సుత్నిక్ వీ ఆర్డర్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇండియాలో 88 శాతం మందికి కోవీషీల్డ్ టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత భారత్ బయోటెక్ అత్యధిక టీకాలు ఇస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

