తగ్గిన పొదుపు.. పెరిగిన అప్పు
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో గ్రామీణులు అప్పులపాలవుతున్నారని నాబార్డ్ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో 4.84 శాతం, ఆగస్ట్‌లో 5.24 శాతం కాగా, సెప్టెంబర్‌లో ఇది ఏకంగా 6.08 శాతానికి పెరిగిపోయింది.
- గ్రామీణ భారతంపై నాబార్డ్ నివేదిక
న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో గ్రామీణులు అప్పులపాలవుతున్నారని నాబార్డ్ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. గ్రామీణ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలైలో 4.84 శాతం, ఆగస్ట్‌లో 5.24 శాతం కాగా, సెప్టెంబర్‌లో ఇది ఏకంగా 6.08 శాతానికి పెరిగిపోయింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఈ డేటాను నాబార్డ్ అధ్యయనం ప్రస్తావించింది. 28 రాష్ర్టాలు, జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ సర్వే ఆగస్ట్ చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సర్వేను నిర్వహించారు.
ఆ సమయంలో వర్షపాతంలో అసమానతల పరిస్థితులు ఉన్నాయి. గత నెల రెండునాటికి రైతులు 1,302.47 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు వేశారు, 11.04 లక్షల హెక్టార్లలో సుమారు ఒక ఏడాది క్రితం పంటలను వేశారు. గత సంవత్సరం కంటే ఆదాయం పెరిగినట్లు కేవలం 27.1 శాతం మంది చెప్పారని ఈ నివేదిక పేర్కొంది. ఈ విధంగా చెప్పినవారు 2025 నవంబర్‌లో 42.2 శాతం మంది. తాజా సర్వేలో తమ ఆదాయం తగ్గిపోయిందని చెప్పినవారు 20.5 శాతం మంది, తమ ఆదాయంలో మార్పు లేదని చెప్పినవారు 52.4 శాతం మంది. ఆదాయం పెరిగినట్లు చెప్పినవారి ఆదాయంలో సగటు పెరుగుదల 10.5 శాతం, 2024 సెప్టెంబర్‌లో ఇది 13.9 శాతం ఉండేది.
ఆదాయంలో పొదుపు వాటా బాగా తగ్గింది
ఈ సర్వే 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమై, ఇప్పటి వరకు 13 విడతలుగా జరిగింది. తాజా సర్వేలో గ్రామీణులు తమ నెలవారీ ఆదాయంలో 12.6 శాతం పొదుపు చేస్తున్నట్లు చెప్పారు.
పెట్టుబడులు కూడా తగ్గుముఖం మూలధనంపై పెట్టుబడులు తగ్గిపోయినట్లు 20.2 శాతం మంది గ్రామీణులు చెప్పారు. అప్పులు పెరిగిపోయినట్లు చెప్పినవారు జూలైలో 28.7 శాతం మంది కాగా, వీరు తాజాగా 32.4 శాతానికి పెరిగారు. అనధికారిక రుణాలే అధికంగా ఉన్నాయి. సగటు వడ్డీ రేటు జూలైలో 17.8 శాతం కాగా, తాజాగా ఇది 18.3 శాతానికి పెరిగిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

