రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) సోమవారం 2019 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) లెవెల్ 6 , 4 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ) పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://rrbcdg.gov.in ద్వారా పరీక్ష షెడ్యూల్‌ను తెలుసుకోవచ్చు.
అధికారిక నోటీసు ప్రకారం, సీబీటీ-2లో పే లెవెల్స్ 6 , 4 షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల కోసం సీబీఏటీ జూలై 30, 2022నుంచి నిర్వహిస్తారు. సీబీఏటీ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు విజన్ సర్టిఫికెట్‌ను నిర్దేశించిన ఫార్మాట్లో సమర్పించాలి. ఈ ఫార్మాట్లో సర్టిఫికెట్ లేకుంటే సీబీఏటీకి అనుమతించరు.