Robots | న్యూఢిల్లీ: శృంగారంలో ఇక నిజ భాగస్వామితో పని ఉండదని గూగుల్ మాజీ ఉద్యోగి మొహమ్మద్ ‘మో’ గవాదత్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అచ్చం నిజ భాగస్వామిలా వ్యవహరించే రోబోలు బెడ్రూములో భాగస్వామి స్థానాన్ని రీప్లేస్ చేయడం ఖాయమని చెబుతున్నారు.
ఏఐ రోబోలు మనషుల్లానే ప్రవర్తిస్తే ఆ అనుభవం నిజమేనా అన్న అనుమానం రాదని, సాంకేతికత మన మెదళ్లలోకి చొచ్చుకుపోవడమే అందుకు కారణమని వివరించారు. టెక్నాలజీతో మనం కనెక్ట్ అయిపోవడం వల్ల మనం మరో వ్యక్తితో మాట్లాడుతున్న భావనే కలుగుతుందని, కాబట్టి నిజ జీవిత భాగస్వామి అవసరం ఉండదన్నారు.