RG Kar rape-murder case | కోర్టు తీర్పు పట్ల సంతృప్తి చెందలేదు.. సంజయ్‌కు జైలు శిక్షపై మమతా బెనర్జీ స్పందన
RG Kar rape-murder case | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. సీఎం మమతా బెనర్జీ దీనిపై స్పందించారు. సంజయ్ రాయ్‌కు కోర్టు విధించిన శిక్ష పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ( RG Kar rape-murder case) దోషి సంజయ్ రాయ్‌కు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. సీఎం మమతా బెనర్జీ దీనిపై స్పందించారు. సంజయ్ రాయ్‌కు కోర్టు విధించిన శిక్ష పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. ‘నేను సంతృప్తి చెందలేదు. మనమంతా మరణశిక్షను డిమాండ్ చేశాం. కానీ కోర్టు మరణించే వరకు జీవిత ఖైదు విధించింది’ అని అన్నారు.
కాగా, గత ఏడాది ఆగస్ట్ 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా తీసుకున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఒకవేళ కోల్‌కతా పోలీసులు ఈ కేసు దర్యాప్తును కొనసాగించి ఉంటే నిందితుడికి మరణశిక్ష నిర్దారించేవారని అన్నారు.
మరోవైపు సీబీఐ దర్యాప్తును మమతా బెనర్జీ ప్రశ్నించారు. ‘వారు (సీబీఐ) దర్యాప్తు ఎలా నిర్వహించారో మాకు తెలియదు. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసిన ఇలాంటి అనేక కేసుల్లో మరణశిక్ష విధించారు. ఈ శిక్ష పట్ల నేను సంతృప్తి చెందలేదు. మరణశిక్షను డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం కావాలి’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

