Microplastics | వృషణాల్లోనూ మైక్రోప్లాస్టిక్.. సంతానోత్పత్తిపై ప్రభావం
పురుషుడి సంతానోత్పత్తికి కీలకమైన వృషణాల్లోనూ మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు. మగ కుక్కలు, పురుషులపై ఈ అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు.
- ఒక గ్రామ్ కణజాలంలో 329.44 మైక్రోగ్రాముల మేర మైక్రోప్లాస్టిక్
- పురుష సంతానోత్పత్తిపై ప్రభావం
- న్యూ మెక్సికో వర్సిటీ అధ్యయనం
Microplastics | హైదరాబాద్, మే 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పురుషుడి సంతానోత్పత్తికి కీలకమైన వృషణాల్లోనూ మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు. మగ కుక్కలు, పురుషులపై ఈ అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు. కుక్కలతో పోలిస్తే పురుషుల వృషణాల్లో మూడు రెట్లు ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించామన్నారు. మైక్రోప్లాస్టిక్ కారణంగా పురుష సంతానోత్పత్తిపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని పరిశోధకుడు జియోజంగ్ యూ పేర్కొన్నారు. వృషణాల్లో 12 రకాల మైక్రోప్లాస్టిక్ రేణువులను కనుగొన్నామని.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ తయారీకి వాడే పాలీఇథైలీన్ (పీఈ), పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) కూడా ఇందులో ఉన్నట్టు వెల్లడించారు.
శరీరమంతటా..
ఒక్క వృషణాల్లోనే కాదు మనుషుల రక్తం, గుండె, ఆఖరికి గర్భిణుల మావిలో (పిండం) కూడా మైక్రోప్లాస్టిక్ అవశేషాలను కనుగొన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. 62 మంది గర్భిణుల మావి నమూనాలను పరీక్షిస్తే.. ప్రతీ గ్రాము కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రోగ్రాముల మేర మైక్రోప్లాస్టిక్ రేణువులను గుర్తించినట్టు వివరించారు.
వృషణాల్లోని ఒక గ్రామ్ కణజాలంలో మైక్రోప్లాస్టిక్ ఇలా..
పురుషులు 329.44 మైక్రోగ్రాములు
కుక్కలు 122.63 మైక్రోగ్రాములు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

