న్యూఢిల్లీ, జూలై 11: యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సీ) విషయంలో సమర్థంగా పనిచేసే స్పీకర్ల తయారీ దిశగా స్విట్జర్లాండ్‌లోని లాసానేకు చెందిన ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అడుగులు ముందుకు వేశారు. ప్లాస్మాతో అతి పలుచని స్పీకర్ల తయారీకి నడుంబిగించారు. ఇందుకోసం ఐయోనైజ్డ్ ఎయిర్ ప్లాస్మా ప్రొపల్షన్ విధానాన్ని అభివృద్ధి చేశారు.
ఏఎన్సీ సామర్థ్యం పుష్కలంగా ఉన్న ఇది బిజీ రూమ్స్‌లో ఉండే గోల, విమానాలు, కార్లు, ఇతర వాహన శబ్దాలను కూడా అడ్డుకుంటుండడం విశేషం. ప్లాస్మా ఆధారిత స్పీకర్లు చుట్టుపక్కల గాలిలోని పలుచని పొరను అయానీకరణం చేయడానికి ఎలక్ట్రోడ్లను ఉపయోగించుకుంటాయి. ఈ స్పీకర్లలో ట్రబల్, బాస్ ఇంటర్ఫెరెన్స్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని ఈపీఎఫ్‌ఎల్ అకౌస్టిక్ గ్రూప్ సీనియర్ సైంటిస్ట్ హెర్వ్ లిసెక్ తెలిపారు.