vaccination record | కొత్త రికార్డు.. మధ్యాహ్నం 1.30 వరకే కోటి డోసుల వ్యాక్సిన్
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు రికార్డు వ్యాక్సినేషన్లే ( vaccination record ) లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. శుక్రవారం నిమిషానికి 42 వేల వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం గమనార్హం.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు రికార్డు వ్యాక్సినేషన్లే ( vaccination record ) లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. శుక్రవారం నిమిషానికి 42 వేల వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం గమనార్హం. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకే కోటి డోసుల మార్క్‌ను దాటేసినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నెల రోజుల్లోనే ఒకే రోజు కోటికి పైగా డోసులు ఇవ్వడం ఇది నాలుగోసారి, ఈ వేగం రానున్న కొత్త రికార్డులకు సూచిక అని ఆ అధికారి అన్నారు. ఈ లెక్కన శుక్రవారం ఒక్క రోజే 2.5 కోట్ల డోసుల మార్క్ అందుకునే అవకాశం కూడా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
శుక్రవారం ప్రధాని మోదీ తన 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 2 కోట్ల డోసులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిమిషానికి 42 వేలు, సెకనుకు 700 డోసులు ఇస్తున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆరెస్ శర్మ ట్వీట్ చేశారు. అటు బీజేపీ కూడా మోదీ బర్త్ డే నుంచి మూడు వారాల పాటు వ్యాక్సినేషన్ సంబురాలు జరపడానికి ప్రణాళిక వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

