కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇన్ఫెక్షనా.. స్వైన్ ఫ్లూ కావచ్చు!

ముంబై: కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కనీసం 90 రోజుల వరకైతే దాని బారిన పడే అవకాశాలు చాలా చాలా తక్కువ అని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఒకసారి కరోనా వచ్చి వెళ్లిన తర్వాత శరీరంలోని యాంటీ బాడీలు మరోసారి వైరస్ బారిన పడకుండా కాపడతాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజులకే మీకు మరోసారి ఇన్ఫెక్షన్ సోకిందా.. అయితే అది స్వైన్ ఫ్లూ కావచ్చని అంటున్నారు డాక్టర్లు. స్వైన్ ఫ్లూ, కరోనా లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల దీనిని గుర్తించడం కూడా కష్టమవుతోందని వాళ్లు చెప్పారు.
ముంబైలో 3 కేసులు
ఒకవేళ కొవిడ్ చికిత్సకు స్పందించకపోతే వెంటనే స్వైన్ ఫ్లూ టెస్ట్ చేయించాలనీ సూచిస్తున్నారు. దీనికి ఓ బలమైన కారణమే ఉంది. ముంబైలో ఇలాగే ఓ వ్యక్తి ఈ మధ్యే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. అయితే తర్వాత కొన్ని రోజులకే ఇన్ఫెక్షన్ సోకింది. జలుబు, జ్వరం, తలనొప్పి వంటి కరోనా లక్షణాలే కనిపించాయి. అయితే ఆ మధ్యే తాను కొవిడ్ నుంచి కోలుకున్నానని చెప్పడంతో డాక్టర్లు స్వైన్ ఫ్లూ టెస్ట్ చేయించారు. పరీక్షల్లో అతనికి హెచ్1ఎన్1 సోకినట్లు తేలింది.
అంటువ్యాధుల నిపుణులు అయిన డాక్టర్ వసంత్ నాగ్వేకర్ ఇలాంటి రెండు కేసులను చూశారు.
మరో వ్యక్తికి హెచ్3ఎన్2 సోకినట్లు గుర్తించారు. ఇది కూడా ఇన్ఫ్లుయెంజా ఎ సబ్టైప్. ఈ కేసులను పరిశీలించిన తర్వాతే డాక్టర్ వసంత్ కీలకమైన సూచనలు చేశారు. అన్నింటినీ కొవిడ్‌లాగే చూడొద్దని, ఇతర వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు గమనించాలని చెప్పారు. కొవిడ్ చికిత్సకు స్పందించకపోతే వెంటనే స్వైన్ ఫ్లూ టెస్ట్ చేయించాలని సూచించారు.
ముంబైలోనే ఎక్కువ
అటు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు కూడా ఈ ఏడాది ముంబైలో రెండు హెచ్1ఎన్1 కేసులు నమోదైనట్లు చెప్పారు. ముంబైలో గత కొన్నేళ్లుగా భారీ సంఖ్యలో హెచ్1ఎన్1 కేసులు నమోదవుతున్నాయి. గతేడాది 44 కేసులు, 2019లో 451 కేసులు ముంబైలో నమోదయ్యాయి.
హెచ్1ఎన్1, కొవిడ్ 19 రెండూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులే అని, అందువల్ల సరైన రోగ నిర్ధారణ అనేది ముఖ్యమని అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఓం శ్రీవాస్తవ అన్నారు. రెండు వ్యాధుల మధ్య పోలికలు ఉన్నా.. అవి వృద్ధి చెందే తీరు, వ్యాపించే తీరులో తేడాలు ఉంటాయని చెప్పారు. కొంత మంది పేషెంట్లయితే కొవిడ్-19, హెచ్1ఎన్1 రెండింటి బారిన పడినట్లు డాక్టర్ శ్రీవాస్తవ వెల్లడించారు. కొన్నిసార్లు హెచ్1ఎన్1 పాజిటివ్ రిపోర్ట్ తప్పుగా వచ్చినట్లు తేలిందని, అయితే దానిని మాత్రం అంత ఈజీగా తీసుకోవద్దని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- H1N1
- H3N2
- Mumbai Swine Flu
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

