piracy| పైరసీకి పాల్పడితే మూడేండ్ల జైలు.. బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
piracy| న్యూఢిల్లీ: పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంతో, మూజువాణి ఓటుతోనే సినిమాటోగ్రఫీ(సవరణ) బిల్లు-2023కు సభ ఆమోదం తెలిపింది. సినిమా పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు.
పదేండ్లు చెల్లుబాటయ్యేలా ఇప్పటివరకు సినిమాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా, ఇకపై దానికి ఎత్తివేసి శాశ్వత సర్టిఫికెట్ జారీచేయనున్నారు. అలాగే వయసువారీగా ‘యూఏ’ సర్టిఫికెట్ జారీచేయాలని ప్రతిపాదించారు. ఇకపై యూఏ 7ప్లస్, యూఏ 13ప్లస్, యూఏ 16 ప్లస్ సర్టిఫికెట్లు జారీచేయనున్నారు. టెలివిజన్, ఇతర మాధ్యమాల్లో ప్రసారానికి ప్రత్యేక సర్టిఫికెట్ జారీచేసేందుకు సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) కి అనుమతించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 3 year jail term
- bill
- CBFC
- Fine
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

