‘ఆధ్యాత్మిక రాజకీయాలకు రజినీకాంత్ మద్దతుగా నిలవాలి’

రామేశ్వరం : తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలకు మద్దతుగా నిలవాలని ఆ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు ఎస్ వేదాంతం కోరారు. బుధవారం ఆయన రామేశ్వరంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆధ్యాత్మిక విలువలు పాటించే పార్టీలకు తమిళ ప్రజలు ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు. ‘రానున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.. తమిళ రాజకీయాల్లో యోధులైన మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి ఈ సారి ఎన్నికల్లో లేరు. తమిళనాడు ఆధ్యాత్మిక రాష్ట్రామా? కాదా నిర్ణయించే ఎన్నికలు ఇవని ఆయన పేర్కొన్నారు.
డీఎంకే నుంచి విడిపోయిన సొంత పార్టీ పెట్టిన ఎంజీఆర్ ఆధ్యాత్మిక రాజకీయాలను అనుసరించారని వేదాంతం అన్నారు. ఎంజీఆర్ తరచూ మూకాంబికా ఆలయానికి వెళ్లి భక్తిభావాన్ని చాటేవారని గుర్తుచేశారు. జయలలిత సైతం ఆధ్యాత్మికతను కొనసాగించారని, కానీ ప్రజల్లో ప్రచారం చేసుకోలేదని చెప్పారు. ‘రజినీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు అనుసరిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయనపై తమిళ ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రాలేకపోయారు. కానీ ఆయన ప్రస్తామించిన అంశాలు ప్రజలకు గుర్తున్నాయి’ అని వేదాంతం పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

